భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) 43వ ఆవిర్భావ దినోత్సవన్ని తాడిపత్రి పట్టణంలో ఘనంగా శనివారం నిర్వహించారు. ముందుగా డివైఎఫ్ఐ పతాకాన్ని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశం కోసం యువతకు, ఉపాధి ఉద్యోగరక్షణ, మెరుగైన విద్య తదితరాల కోసమే దేశంలో పనిచేస్తున్న ఏకైక యువజన సంఘం డివైఎఫ్ఐ అని కొనియాడారు.