ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం చందర్లపాడు గ్రామంలో శనివారం నూతన రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకును ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా రూ. 72 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా 1 లక్ష 20 వేల లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేసామని ఎమ్మెల్యే తెలిపారు.