రాష్ట్ర ప్రభుత్వం పై టిడిపి యువనేత నారా లోకేష్ విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో కరువు కారణంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవువుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. వందేళ్లలో ఈ ఏడాదే అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్కు రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంపై లేదని మండిపడ్డారు.