ముదిగుబ్బలోని బస్ షెల్టర్లో ఏసు (35) అనే వ్యక్తి అనారోగ్యానికి గురై శనివారం మృతి చెందాడు. విజయవాడకు చెందిన అతనికి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో పదిహేడు రోజులుగా మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఉంటున్నాడు. అనారోగ్యానికి గురై మృతి చెందడంతో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మూర్తి తెలిపారు.