శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త దీపిక శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీపురం ప్రాంతంలో రోడ్డు డ్రైనేజీలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అవార్డు కౌన్సిలర్ నా దృష్టికి తీసుకురావడంతో ఉన్నతాధికారులతో చర్చించి 35 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.