శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈస్ట్ టెర్మినల్‌ను శుక్రవారం ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) వెల్లడించింది. రోజురోజుకు పెరుగుతున్న విమాన ప్రయణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నాలుగో దశ విస్తరణలో భాగంగా ఈ అదనపు టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఈస్ట్ ప్రాంతాన్ని 56,474 చదరపు మీటర్లు విస్తరించి ప్రస్తుత టెర్మినల్‌తో అనుసంధానించినట్లు పేర్కొంది. దీంతో మొత్తం 2,74,118 చదరపు మీటర్ల విస్తీర్ణంతో టెర్మినల్ అందుబాటులోకి వచ్చిందని తెలిపింది.