ఎన్నికల నిర్వహణ కోసం 'ఎన్కోర్' పేరుతో ఒక అంతర్గత సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల కార్యకలాపాలు సజావుగా జరిగడం కోసం అనేక రకాల ఫీచర్లను ఈ సాఫ్ట్వేర్ అందిస్తోందని తెలిపింది. అభ్యర్థి నామినేషన్ నుంచి ఓటర్ ట్రాకింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాలు, డేటా నిర్వహణ వంటి అంశాల్లో రిటర్నింగ్ అధికారులకు ఈ సాఫ్ట్వేర్ సహాయంగా ఉంటుందని వివరించింది.