మనం ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఎన్నికల అధికారులు ఓ రంగును ఎడమ చేతి చూపుడు వేలుపై పూస్తారు. దీనినే సిరా అంటారు. ఈ సిరాలో 'సిల్వర్ నైట్రేట్ (AgNo3)' అనే రసాయాన్ని ఉపయోగిస్తారు. రసాయ మెక్సికోకు చెందిన బయోకెమికల్ ఇంజనీర్ ఫిలిబెర్టో వాజ్క్వెజ్ డేవిలా దీనిని కనుగొన్నారు. 1962లో భారతదేశం యొక్క మూడవ సార్వత్రిక ఎన్నికల సమయంలో సిరా మొదటిసారి ఉపయోగించబడింది. ఇప్పుడు, ఇది ప్రతి సాధారణ ఎన్నికలలో ఉపయోగించబడింది.