దీపావళి సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు శుభవార్త తీసుకొచ్చింది. లోన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ‘దీపావళి ధమాకా 2023’ పేరుతో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దీని కింద 8.40 శాతం వడ్డీకే గృహ రుణం, 8.75 శాతం వడ్డీకే వాహన రుణాన్ని అందిస్తోంది. అలాగే ఈ రెండు లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను పూర్తిగా ఎత్తివేసింది.