నరసాపురంలో మూడు రోజుల క్రితం పట్టపగలు ఎస్బీఐ బజారు బ్రాంచిలో సిబ్బందిని కత్తితో బెదిరించి రూ 6.50 లక్షలు చోరీ చేశారు. ఈ చోరీ కేసును ఛేదించినట్లు ఎస్పీ రవి ప్రకాష్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో నిందితుడు తానేటి సురేషబాబును అరెస్టు చేశామన్నారు. నిందితుడు స్వస్థలం నర్సాపురం మండలం రుస్తుం బాధ గ్రామం అని తెలిపారు. నిందితుడి నుంచి రూ 6.50 లక్షలు నగదు, కత్తిని స్వాధీనం చెసుకున్నట్లు ఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు.