పెదకాకాని గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు బూర్లె శ్రీనివాసరావు(36) గత శుక్రవారం పెదకాకానిలోని ఒమేగా ఆసుపత్రి సమీపంలో పనిచేస్తూ భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డారు. వైద్యశాలకు తరలించగా శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.