ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా గోడి గ్రామంలోని గురుకుల స్కూళ్లలో 400 మంది విద్యార్థులకు రెండే టాయిలెట్లు ఉండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అక్కడ హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేసింది. బెడ్లు లేక విద్యార్థులు కింద పడుకోవడం, దుప్పట్లు లేకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించింది. వెంటనే పరిస్థితులను సరిదిద్దాలని సంక్షేమ శాఖ కమిషనర్ ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.