అవనిగడ్డ మండలం వేకనూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వరకు కాలినడకతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాల కావెళ్ళు సమర్పించడానికి ఆదివారం భక్తులు బయలుదేరారు. వేకనూరు అయ్యప్ప స్వాములకు అవనిగడ్డ వంతెన సెంటర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద యువజన వికాస్ సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ మంచినీరు, పండ్లు సమర్పించారు.