కోతిని వేటాడేందుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన చిరుత షాక్ కొట్టి మృత్యువాత పడింది. ఈ ఘటన తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో జరిగింది. ఓ కోతిని వేటాడేందుకు చిరుతపులి ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కింది. ఈ క్రమంలో షాక్ కొట్టడంతో కోతితోపాటు చిరుత కూడా మృతి చెందింది. ఈ ఘటన చంద్రాపూర్ సమీపంలోని సిందేవాహి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటవీ, విద్యుత్ శాఖ బృందాలు జంతువులను ట్రాన్స్‌ఫార్మర్‌పై నుంచి దించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa