బెంగళూరులో దారుణం జరిగింది. ఓ మహిళా ప్రభుత్వ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బెంగళూరులో మైన్స్&ఎర్త్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రతిమ(37) పనిచేస్తున్నారు. ఆమె సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఉదయం ప్రతిమ సోదరుడు ఇంటికి వచ్చి చూడగా శవమై ఉంది. సమాచారం మేరకు డీసీపీ రాహుల్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.