తక్కువ ఆమ్ల గుణం కలిగిన నేల ఉన్న చోట క్యారెట్ లు బాగా పెరుగుతాయి. క్యారెట్ విత్తనాలను నాటే ముందు ఎరువు పొడి పొడిగా విడదీయాలి. లోతైన ఇసుకతో కూడిన మురుగునీటి వసతి కలిగిన గరప నేలలు క్యారెట్ సాగుకి చాలా అనుకూలమైనవి. బరువైన బంక నేలలు క్యారెట్ సాగు చేయడానికి పనికిరావు. బంక నేలల్లో వేర్ల పెరుగుదల లోపించి దుంపలు అభివృద్ధి చెందకుండా పక్క వేర్లు ఏర్పడతాయి.