మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో జరిగే దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రకూట్‌లోని మందానికి నది తీరంలో ఐదు రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. లంకను జయించిన శ్రీరాముడు అయోధ్యు తిరిగి వస్తూ.. రుషులతో కలిసి మందాకిని నదిలో దీపారాధన చేసినట్లు స్థానికులు చెబుతారు.