అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజారక్షణ బేరి బస్సు యాత్ర ఆదివారం పరవాడ మండలం లంకెలపాలెం చేరుకుంది. కళాకారులు కోలాటంతో నాయకులు కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర నాయకులు ఏవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింహారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబరు 15న ప్రజారక్షణ భేరి పేరుతో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.