ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బృందం సోమవారం పర్యటించనుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి రాష్ట్ర టీడీపీ వ్యవసాయ కమిటీ బృందం నిర్ణయించింది. సోమవారం ఉదయం 10:40 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం, కూడేరు మండలం, ఇప్పేరు సమీపంలో వేరుశనగ, ఉలవ పంటలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీసత్యసాయిజిల్లా పెనుకొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. 2:30 గంటలకు రొద్దం మండలం, చోళేమర్రి క్రాస్‌లో వేరుశనగ పొలం పరిశీలిస్తారు. సాయంత్రం 3:30 గంటలకు మడకశిర మండలం, కోడిగానిపల్లి సమీపంలో పంటలను పరిశీలించి.. వసల వెళ్ళిన వ్యవసాయ కూలీల కుటుంబసభ్యులతో టీడీపీ బృందం సమావేశమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.