తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సొమ్ము వైసీపీ నేతలు, మంత్రులు కాజేసేందుకు కుట్రపన్నుతున్నారని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరామ్ ప్రసాద్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... వైసీపీ ప్రభుత్వంలో తిరుమల క్షేత్రం రాజకీయ, వ్యాపార కేంద్రంగా మారింది. మంత్రులు రోజా, అప్పలరాజు, ఉషశ్రీ చరణ్... స్వామి వారి దర్శనాల్ని సొమ్ము చేసుకోవటానికి వందల మందిని వెంటేసుకోస్తున్నారు. సీఎంకి, ఆయన పార్టీ నాయకులకు దేవుళ్లు అంటే భయం లేదు, అర్చకులంటే గౌరవం లేదు. దేవుడిని నమ్ముకుని బతికే వారితో అటలాడితే కాలగర్భంలో కలిసిపోతారు అని రాంప్రసాద్ హెచ్చరించారు.