ఆర్టీసీ ఉద్యోగులకు జీపీఎస్ అమలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్ ఎ రాజారెడ్డి తెలిపారు. డోర్ డెలివరీ మాసోత్సవాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక కార్మికులందరు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. త్వరలో వారికి జీపీఎస్‌ను అమలులోకి తీసుకువస్తాం. 1,500 డీజిల్, 1,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నాం' అని పేర్కొన్నారు.