కంబదూరు మండలం రాంపురం గ్రామంలో గౌరన్న చౌదరి అనే రైతుకు సంబంధించిన రెండు ఎకరాల పొలం లో సాగు చేసిన వరిపంట ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నేలపాలైంది. దీంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతు కంటతడి పెట్టాడు. ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి తగు నివేదికలను పంపి ఆర్థిక సాయమందేలా తగు చర్యలు తీసుకోవాలని బాధిత రైతు సవినయంగా కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa