ఉరవకొండ పట్టణ శివారులోని అనంతపురం-బళ్లారి 42వ జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ద్విచక్రవాహనం ఢీకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మతిస్థిమితం లేని మహిళ తీవ్రంగా గాయపడింది. బైక్ పై వెళ్తున్న తండ్రి, కుమారుడు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా మతిస్థిమితం లేని మహిళను కొందరు యువకులు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు.