కందుకూరు నియోజకవర్గంలో గడచిన 24 గంటల్లో 476 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని సోమవారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు. అత్యధికంగా గుడ్లూరు మండలంలో 125. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కందుకూరు మండలంలో 115. 6 మిల్లీమీటర్లు, ఉలవపాడు మండలంలో 113. 2 మిల్లీమీటర్లు, లింగసముద్రం మండలంలో 97. 2 మిల్లీమీటర్లు, వలేటివారిపాలెం మండలంలో 24. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వివరించారు.