సమాచార హక్కు చట్టం సమాజానికి ఎంతో ఉపయోగకరమైందని, దాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా, ప్రజాహితానికి వాడుకోవాలని చీరాల మున్సిపల్ కమిషనర్ కే రామచంద్రారెడ్డి చెప్పారు. ఆర్. టి. ఐ రక్షక్ చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ గా నియమితుడైన తులసి చంద్రశేఖర్ సోమవారం కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి ఆయన సహకారాన్ని కోరారు. జనహితానికి జరిగే ఏ కార్యక్రమానికైనా తోడ్పాటునందిస్తానని కమీషనర్ హామీ ఇచ్చారు.