వాడరేవు- పిడుగురాళ్ల రహదారిలో పర్చూరు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఓ యువకునికి తీవ్ర గాయాలు అయ్యాయి. చీరాల మరియంపేటకు చెందిన కుమార్ బైక్ పై గుంటూరు నుండి వస్తుండగా చీరాల వైపు నుండి వేగంగా వచ్చిన ఓ బైకు ఢీకొంది. దీంతో కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 అంబులెన్స్ లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండో వ్యక్తి ఏమయ్యాడన్నది తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa