గిద్దలూరులోని కొంగలవీడు రోడ్డు సచివాలయ పరిధిలో సోమవారం ఇంటింటికి రేషన్ పథకం అటకెక్కింది. ప్రజలు రేషన్ వాహనం దగ్గరకే వచ్చి రేషన్ తీసుకోవాలని ఇంటింటికి రేషన్ అందించే వాహనదారుడు హుకుం జారీ చేస్తున్నాడని ప్రజలు అంటున్నారు. గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం కనిపించలేదనిఇంటింటికి రేషన్ అందించే వాహనదారుడు సంబంధిత అధికారులను లెక్కచేయడం లేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.