రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) 3 రోజులు నిర్వహించనున్న ‘అఖిల భారతీయ కార్యకారి మండలి’ సమావేశాలు ఆదివారం గుజరాత్‌లోని భుజ్ పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆధ్వర్యంలో జరగిన ఈ చర్చలకు గుజరాత్‌లోని 382 మంది సీనియర్ కార్యకర్తలు హాజరయ్యారని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశాలకు ముందు గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్‌ను కలిశారు.