బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. 'చూడు చిన్నమ్మా.. పున్నమ్మా.. పురందేశ్వరి. మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పాతాళంలోకి పోయింది. పిత్రార్జితంగా మీకు వాటా వున్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే.. మీ ఎఫెక్ట్‌తో బాబు కూడా జైలుకు వెళ్ళడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు' అంటూ రాసుకొచ్చారు.