ఢిల్లీలో వాలు కాలుష్యం ప్రమాకరస్ధాయికి చేరింది. దీంతో వాయు కాలుష్యానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు ఢిల్లీ వాసులను హెచ్చరించారు. వాయు కాలుష్యం క్యాన్సర్ ముప్పుకు కారకమనేందుకు ఆధారాలున్నాయని ఎయిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ పీయూష్ రంజన్ తెలిపారు. శ్వాసకోశ వ్యవస్థనూ కూడా దెబ్బతీస్తుందన్నారు. వాయు కాలుష్యం మనుషుల డీఎన్ఏను ధ్వంసం చేయడంతో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయని చెప్పారు.