ఇజ్రాయిల్, గాజా పై ప్రతిదాడులకు దిగడంతో గాజాలో క్రమంగా ఆకలికేకలు మొదలవుతున్నాయి. సలాహ్ అల్-దీన్ వద్ద ఇజ్రాయెల్ సేనలు మోహరించడంతో ఉత్తర-దక్షిణ గాజాల మధ్య సంబంధాలు తెగిపోడంతో ఈజిప్ట్ నుంచి రఫా సరిహద్దు నుంచి వస్తున్న సాయం గాజాకు చేరడం లేదు. ‘‘గాజాలో ఒక సగటు పౌరుడు రోజుకు రెండు రొట్టెముక్కలు తిని జీవిస్తున్నాడు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవు’’ అని ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు.