ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయని.. 175 స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో ఆమె మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నిస్తే తనను టీడీపీ కోవర్టు అంటున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధిని పట్టించుకోకుండా కక్షపూరిత రాజకీయాలు చేస్తోన్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని అన్నారు.