శ్రీసత్య సాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంగళవారం పెనుకొండ పట్టణంలో ఎన్ టి ఆర్ సర్కిల్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టిడిపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం గో బ్యాక్ అంటూ నల్ల బెలూన్ లతో నిరసన తెలిపారు.