ఆరోగ్య కారణాలతో బెయిల్ పై జైలు నుండి చంద్రబాబు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయనకు వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించనున్నారు. ఇప్పటికే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.