ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 12:31 PM

వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.... అమ్మ ఒడి కావాలని, చేయూత, సున్నావడ్డీ కావాలని ఎవరూ అడగలేదు. పేదలకు ఆర్థిక చేయూతనివ్వాలని జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు నేరుగా రూ.2.40 లక్షల కోట్లిచ్చారు జగనన్న. చంద్రబాబు సీఎంగా పని చేసినప్పుడు  ఏ ప్రాజెక్టు పెట్టినా రూ.లక్షల కోట్లు కమీషన్లు దండుకోవాలని చూశాడు. పేద ప్రజల సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచన చేయలేదు.  రాజ్యసభలో నలుగురు బీసీలకు అవకాశం కల్పించారు జగనన్న. బీసీలను రాజకీయంగా అత్యున్నత స్థాయిలో సీఎం జగన్ కూర్చోబెట్టారు అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com