వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.... స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జగనన్న పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైంది. బీసీ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా వేదిక మీదకు వచ్చి మాట్లాడుతున్నానంటే జగనన్న ఆలోచన విధానం వల్లే సాధ్యమైంది. రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలో అందరూ ఆలోచన చేయాలి. సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లుగా అమలు చేస్తున్నారు. అప్పటి వరకు ఉన్న పింఛన్ వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికే మూడు విడతలు ఇచ్చారు. అక్కచెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని బాబు మోసం చేశాడు. కానీ జగనన్న నాలుగు విడతలుగా చెల్లిస్తున్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే, రైతు భరోసా ఇస్తున్న సీఎం జగనన్న. ఇంగ్లీషు మీడియం తెచ్చి ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూళ్లకు మించి అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకాలు జగనన్న సీఎంగా ఉంటేనే కొనసాగుతాయి అని తెలియజేసారు.