వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కోసం లక్షల కోట్ల రూపాయలను పథకాల రూపంలో నేరుగా అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇంగ్లీషు మీడియం చదువులు పేదవర్గాల పిల్లలకు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్నింటా అగ్రస్థానం ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో అబద్ధాలు చెప్పారు. గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు జగనన్న. ఈ రాష్ట్రచరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన చరిత్ర జగనన్నది. మనకు సాయం చేసే, అండగా వుండే నాయకుడు జగనన్న రూపంలో దొరికారని తెలిపారు.