వరుసగా ఐడో ఏడాది రెండో విడత వైయస్ఆర్ రైతు భరోసా సాయం విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ..... పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసిన సీఎం వైయస్ జగన్‌కు జిల్లా ప్రజానీకమంతా రుణపడి ఉంటుందని అయన అన్నారు. కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో సులువుగా అభివృద్ధి చెందుతుందని, భూములున్న ప్రతి ఒక్కరైతులకు ఆర్థిక భరోసా ఏర్పడటంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు.