వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ..... చెప్పిన దానికన్నా ఎక్కువ సంక్షేమం చేస్తున్న జగనన్న. చెప్పాడంటే చేస్తాడంతే అని పేరు తెచ్చుకున్నారు. నేను పేదల పక్షం, నా యుద్ధం పెత్తందార్లతో అని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. కాకినాడ రూరల్ పరిధిలో రూ.800 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో వేశారు. లక్షమందికి పైగా లబ్ధిదారులున్నారు. వీరిలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సరిగ్గా ఆరేళ్ల కిందట జగన్ గారు పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి వెళ్తూ నాకు దృష్టిలోపం ఉంది, ఆపరేషన్ చేయించుకొని వస్తానన్నాడు. పేదలు ఆయనకు కనబడరు. సొంత కులస్తులు, పెత్తందార్లు మాత్రమే ఆయనకు కనపడతారు. ఈ విషయం జనం ఎప్పుడో గమనించారు అని అన్నారు.