కర్ణాటక మాజీ స్పీకర్, మాజీ మంత్రి డీబీ చంద్రేగౌడ (87) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో దారదహళ్లిలోని తన నివాసంలో సోమవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. 1971లో కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1978లో చిక్కమగళూరు లోక్సభ సభ్యుడిగా రాజీనామా చేసి ఇందిరాగాంధీ విజయం కోసం కృషి చేశారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.