రాప్తాడు మండలం గాండ్లపర్తి సర్పంచ్ నరేష్ కు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ప్రారంభోత్సవ సభ ఉన్నందున సభకు వెళ్ళడానికి అనుమతి లేదని పోలీసులు ముందుగా నోటీసులు జారీ చేశారు. పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.