స్పందన కార్యక్రమంలో అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. స్పందనలో భాగంగా కలెక్టరేట్లో సోమవారం ప్రజలనుంచి జేసీ అపరాజిత సింగ్, డీఆర్వో పి.రోజా వివిధశాఖల అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పందనలో వచ్చిన అర్జీల పరిష్కారంపై జిల్లాఅధికారులు ప్రత్యేకశ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, డీఆర్డీఏ పీడీ పీఎ్సఆర్ ప్రసాద్, డీఎ్సవో పార్వతి, డీఈవో తాహెరాసుల్తానా, ముడా వీసీ రాజ్యలక్ష్మీ వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.