జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రశ్నిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తికి వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిన మంగళవారం ఉదయం అనంతపురంలో గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.