రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా వస్తున్న సందర్భంగా వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మంగళవారం సిపిఐ హిందూపురం పట్టణ కార్యదర్శి కనిశేట్టిపల్లి వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసి 1టౌన్ కు తీసుకెళ్లారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలిను అరెస్ట్ చేసి లేపాక్షి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతుంటే ఇలా అరెస్టు చేయడం సబబు కాదన్నారు.