పట్టిసీమ ప్రాజెక్టును టీడీపీ నేత దేవినేని ఉమ సందర్శించి.. గోదావరికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... పట్టిసీమ ఒక నాయకుడి విజన్, ఆలోచన, ఆచరణ. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో కలిపిన ఒక మహా నాయకుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధం చేశారు. విశాఖలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ మీద సదస్సు జరుగుతుంది. ప్రభుత్వం ఐదు కోట్లు ఖర్చు పెడుతుంది. దీని గురించి సీఎం ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు. 90 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. విద్యార్థులు, ఇంజనీర్లు ఉన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ కూడా ఉన్నారు. ఒక్క మాట కూడా నదుల అనుసంధానం గురించి ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వు అర్హుడవా?, 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కడైనా వచ్చి ఈ పట్టిసీమ నేలను చూశారా? అని ప్రశ్నించారు.