రొద్దం మండలం కలిపి చెరువు కట్ట కింద సాగు చేసిన దాదాపు 400 ఎకరాలలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తము నేలమట్టం అయ్యిందని వరిసాగు చేసిన రైతులకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ రైతులను ఆదుకోవాలని యం. పి. పి. చంద్రశేఖర్ మంగళవారం కోరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి నష్ట పరిహారం ను అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు.