ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతిపక్షాలను ఎదురుకోలేకే ఈ పిరికిపంద చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 07, 2023, 01:48 PM

ప్రజాస్వామ్యబద్ధంగా  ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేని పిరికిపంద సీఎం జగన్ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పర్యటన నిరసిస్తూ చలో పుట్టపర్తికి టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనిపై కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను ప్రజాస్వామంగా ఎదుర్కోలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవలను ప్రజలకు తెలియచెప్పడమే తాము చేసిన నేరమా అని నిలదీశారు. ఏం నేరం చేసామని నిన్న సాయంత్రం నుంచి పోలీసులు నిర్బంధించారని అడిగారు.  అడుగడుగునా అనంతపురం జిల్లా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com