అనంతపురం జిల్లాలో నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని మంగళవారం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పేర్కొన్నారు. బాణసంచా విక్రయ లైసెన్స్ కల్గిన దుకాణదారులు మాత్రమే అమ్మాలని, మిగితా ఎవరు విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దీపావళి పురస్కరించుకుని జిల్లాలో టపాసుల అక్రమ విక్రయాలు జరుగకుండా ఉండేందుకు, లైసెన్స్ కల్గిన దుకాణదారులు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.