లక్ష్యసాధనలో వెనకడుగు వేయరాదని యాదమరి వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ అన్నారు. మంగళవారం యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓ లక్ష్మీనారా యణ అధ్యక్షతన ఆశా కార్యకర్తల నెలవారి సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో అందించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయరాదన్నారు.