ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు (డీమానిటైజేషన్) చేపట్టి ఏడేళ్లు పూర్తవుతున్నాయి. 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటలకు ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రూ.500లు, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో రూ.500లు, రూ.2,000ల కొత్త నోట్లు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయంతో దేశప్రజలు చాలా ప్రభావితమయ్యారు. దీనిని కొందరు సమర్ధించగా, మరికొందరు వ్యతిరేకించారు.